2026 సంవత్సరం ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఏర్పడే చివరి సూర్య గ్రహణం కూడా ఇదే. ఇక గ్రహణం అంటే చాలా మందిలో భయం మొదలవుతుంది. సూతక కాలం వర్తిస్తుందా? దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటించాలని, కానీ, భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు అని చెబుతున్నారు పండితులు.
అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు. అయితే అయినప్పటికీ ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ గ్రహణం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో మూడు రాశుల వారికి అనే సమస్యలను, కష్టాలను తీసుకరానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.
సింహ రాశి : సింహ రాశి వారిపై సూర్య గ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అలాగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆందోళన టెన్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.
కన్యా రాశి : కన్యా రాశి వారు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. కష్టానికి తగిన ఫలితం లభించదు. అంతే కాకుండా జీవితంలో అసంతృప్తి ఎక్కువ అవుతుంది. నిరుద్యోగులకు జాబ్ దొరకడం కష్టం అవుతుంది. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వేధిస్తాయి. కుటుంబంలో నిరంతరం గొడవలు, అల్లర్లు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం.




