Reading Time: < 1 minute
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ కొత్త రూల్స్‌ తెలుసుకోకపోతే నష్టమే!

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అదనపు లగేజీని తీసుకెళ్లాలనుకునే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్‌లైన్‌లో లగేజీని బుక్ చేసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. కన్ఫర్మ్ రిజర్వ్డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ప్రయాణ తరగతిని బట్టి ఉచిత లగేజీ పరిమితులను రైల్వే నిర్ణయించింది. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కేజీలు, ఏసీ 2-టైర్ లో 50 కేజీలు, స్లీపర్‌లో 40 కేజీలు, సెకండ్ క్లాస్‌లో 35 కేజీల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే ఏసీ 3-టైర్, చైర్ కార్‌లలో ఉచిత, గరిష్ఠ పరిమితి రెండూ 40 కేజీలే కావడంతో ఇందులో అదనపు లగేజీకి అవకాశముండదు. పరిమితికి మించిన అదనపు లగేజీకి సాధారణ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ చార్జ్ వసూలు చేస్తారు. కనీస చార్జీ రూ. 30గా నిర్ణయించారు. ఇండియన్ రైల్వేస్ పార్శిల్ పోర్టల్ ద్వారా అదనపు లగేజీని బుక్ చేసుకుని, స్టేషన్‌లోని పార్శిల్ ఆఫీస్‌లో తూకం వేయించి రసీదు పొందవచ్చు. ఈ నిర్ణయంతో ప్రయాణికుల సమయం ఆదా కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!