Reading Time: 2 minutes
Ramayana: 4000 కోట్ల బడ్జెట్.. రామాయణం సినిమాలో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ అంటే..

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అలాగే కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటీనటులు తీసుకునే రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్, ఒక్కో భాగానికి గరిష్టంగా రూ. 75 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు భాగాలకు కలిపి మొత్తం రూ. 150 కోట్లు అందుకుంటున్నాడు.

ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తూ, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న కన్నడ నటుడు యష్, ఒక్కో భాగానికి రూ. 50 కోట్లు చొప్పున, రెండు భాగాలకు కలిపి మొత్తం రూ. 100 కోట్లు అందుకుంటున్నారు. సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి, ఒక్కో భాగానికి రూ. 6 కోట్ల చొప్పున మొత్తం రూ. 12 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న సన్నీ డియోల్ ఒక్కో భాగానికి రూ. 20 కోట్లు, దీంతో మొత్తం రూ. 40 కోట్లు…బుల్లితెర నటుడు రవి దూబే లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ఒక్కో పాత్రకు రూ. 10 కోట్లు, మొత్తంగా రూ. 20 కోట్లు చెల్లిస్తున్నారు.

ఈ చిత్రంలో విద్యుత్‌జిహ్వ పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్, తాను ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటిస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా, పాత రామాయణ సిరీస్‌లో శ్రీరాముడి పాత్రతో ప్రసిద్ధి చెందిన సీనియర్ నటుడు అరుణ్ కోవిల్, ఈ చిత్రంలో చక్రవర్తి దశరథుడి పాత్రను తిరిగి పోషించనున్నారు. ఈ చిత్రంలో లారా దత్తా, కాజల్ అగర్వాల్, రాకుల్ ప్రీత్ సింగ్, శోభన, ఫైసల్ మాలిక్ , అనేక ఇతర ప్రముఖ తారలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులలో భారీ అంచనాలను సృష్టించింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..