Reading Time: < 1 minute

బంగ్లాదేశ్‌‌‌‌ లో చిన్మయ్ కృష్ణదాస్‌‌‌‌కు బెయిల్

Caption of Image.

ఢాకా: బంగ్లాదేశ్‌‌‌‌లో జైలులో ఉన్న హిందూ హక్కుల నేత చిన్మయ్ కృష్ణదాస్‌‌‌‌కు హైకోర్టు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది ఆదివారం తెలిపారు. అయితే, ఆయనపై మరికొన్ని కేసులు పెండింగ్‌‌‌‌లో ఉండటంతో ప్రస్తుతానికి కృష్ణదాస్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. బంగ్లాదేశ్‌‌‌‌లో జరిగిన ఓ నిరసన ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానించారనే అభియోగంతో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి నవంబర్ 2024లో అరెస్టు చేశారు.

ఆ తర్వాత కృష్ణదాస్‌‌‌‌పై హత్య, హత్యాయత్నం, విధ్వంసం వంటి మరిన్ని కేసులు పెట్టారు. అయితే, రెండు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాది అపూర్వ కుమార్ భట్టాచార్య తెలిపారు. దేశద్రోహం, హత్య వంటి మరో నాలుగు కేసులు పెండింగ్‌‌‌‌లో ఉండటం వల్ల ఆయన ఇప్పట్లో విడుదలయ్యే చాన్స్ లేదని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.