Fixed Deposit Rules: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఫిక్స్డ్ డిపాజిట్లకు (FD) సంబంధించి ‘బల్క్ డిపాజిట్ల’ నిబంధనలలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త మార్పుల వల్ల బ్యాంకులు బల్క్ డిపాజిట్లకు, సాధారణ రిటైల్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను ఆఫర్ చేసే అవకాశం లభించింది. అసలు ఈ నిబంధన ఏంటి? దీనివల్ల సామాన్య ఎఫ్డీ దారులపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..
అసలు ఆర్బీఐ మార్చిన నిబంధన ఏమిటి?: గతంలో బ్యాంకులు రూ. 2 కోట్ల వరకు ఉండే డిపాజిట్లను ‘రిటైల్ డిపాజిట్లు’గాను, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లను ‘బల్క్ డిపాజిట్లు’గా పరిగణిస్తారు. అయితే, మారిన నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్ల పరిమితిని రూ. 3 కోట్లకు ప్రతిపాదించడం, పెంచడం జరిగింది. దీనితో పాటు బల్క్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో వ్యత్యాసం చూపించడానికి బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ జారీ చేసింది. బల్క్ డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతి రోజు ఉదయం 10 గంటల, 10 నిమిషాల గ్రేస్ టైమ్తో, గరిష్టంగా 10:10 గంటల్లోపు బ్యాంకు వెబ్సైట్లో వెల్లడించాలని అని ఆర్బిఐ తన సర్క్యులర్లో పేర్కొంది.
డిపాజిట్దారులపై, బ్యాంకులపై పడే ప్రభావం ఏమిటి?: పెద్ద మొత్తం చేసే డిపాజిట్ వారికి (బల్క్ డిపాజిటర్లు): రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసే కంపెనీలు, అధిక నికర విలువ వ్యక్తులకు (HNIలు) బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లలో మార్పులు ఉన్నాయి. బ్యాంకులు తమ వద్ద ఉన్న లిక్విడిటీ (నగదు లభ్యత) అవసరాలను బట్టి వారికి ప్రత్యేక వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు.
సామాన్య ఇన్వెస్టర్లకు (రిటైల్ డిపాజిటర్లు – రూ. 3 కోట్ల లోపు): సాధారణంగా రూ. 3 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి పెట్టే సామాన్య ఇన్వెస్టర్లకు సాధారణ ఆఫర్లు యథాతథంగా వర్తిస్తాయి. అయితే, బల్క్ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ భారం పెరిగితే లేదా తగ్గితే.. దాని ప్రభావం సాధారణ ఎఫ్డీ రేట్ల సర్దుబాటుపై కూడా పడే అవకాశం ఉంది. డిపాజిట్ల సేకరణలో బ్యాంకుల పోటీ: ప్రస్తుతం బ్యాంకుల్లో రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరగడం, దానికి తగినట్లుగా డిపాజిట్లు రాకపోవడం వల్ల బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆర్బీఐ అందించిన ఈ మార్పుల ద్వారా పెద్ద మొత్తం నిధులను వేగంగా ఆకర్షించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?: మీ వద్ద ఉన్న పొదుపు వరకు ఎఫ్డీ చేసే ముందు వివిధ బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లను తప్పకుండా సరిపోల్చుకోండి. బ్యాంకులు నిర్దిష్ట కాలావ్యవధులు ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. అందుకే సరైన వ్యవధిని బట్టి ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ కొత్త మార్పుల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతోంది. అలాగే బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధుల నిర్వహణను మరింత వేగవంతంగా, సరిగ్గా చేసుకోగలరని ఆర్థిక నిపుణులు.




