Reading Time: 2 minutes

అశ్విన్ భయ్యా నన్ను క్షమించు.. నీకు పర్సనల్గా మెసేజ్ చేస్తా.. అర్ష్‌దీప్ వ్యాఖ్యలపై నెట్టింట చర్చ!

Caption of Image.

Arshdeep Singh Apology: టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన కెరీర్‌లో కలిసి ఆడిన టాప్-5 బౌలర్ల జాబితాను ప్రకటిస్తూ.. భారత దిగ్గజ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు 5వ స్థానం కేటాయించాడు. కానీ, తన ఐపీఎల్ తొలి కెప్టెన్ అయిన అశ్విన్‌ను చివరి స్థానంలో పెట్టాల్సి రావడంపై అర్ష్‌దీప్ చెప్పిన క్యూట్ సారీ, ఫన్నీ వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

* భువనేశ్వర్ కుమార్ (No. 1): భువీ భాయ్ నా ఆల్‌టైమ్ ఫేవరెట్ బౌలర్.. అతని పట్ల నాకు కొంత వ్యక్తిగత అభిమానం ఉంది. అందుకే అతనికి మొదటి స్థానం ఇచ్చానని తెలిపాడు.

* మహమ్మద్ షమీ (No. 2): ఎలాంటి వికెట్ పైనైనా బంతిని అద్భుతంగా సీమ్ చేయగల సత్తా మహమ్మద్ షమీ సొంతం. అతని బౌలింగ్ నైపుణ్యం, సీమ్ పొజిషన్ అద్భుతమని కొనియాడాడు.

* కుల్‌దీప్ యాదవ్ (No. 3): చైనామెన్ బౌలింగ్ వేసే అరుదైన నైపుణ్యం కుల్‌దీప్‌కు ఉందని ప్రశంసించాడు.

* యుజ్వేంద్ర చాహల్ (No. 4): పంజాబ్ కింగ్స్ టీమ్‌లో మేమిద్దరం సహచరులం.. యూజీ భాయ్ రికార్డులు ఎంతో బాగున్నాయి.. అతను బోలెడన్ని వికెట్లు తీసుకున్నాడుని అర్షదీప్ సింగ్ పేర్కొన్నాడు.

* రవిచంద్రన్ అశ్విన్ (No. 5): అశ్విన్ భాయ్‌ను చివరి స్థానంలో పెట్టడం నాకూ ఇష్టం లేదు.. కానీ పై 4 స్థానాలు భర్తీ అవ్వడంతో వేరే దారి లేక 5వ స్థానంలో పెట్టాల్సి వచ్చింది.. ఆయన గొప్ప బౌలర్, అంతేకాదు ఐపీఎల్‌లో పంజాబ్‌కు ఆడేటప్పుడు నా ఫస్ట్ కెప్టెన్ కూడా ఆయనే.. సారీ అశ్విన్ భాయ్, మీకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి క్షమాపణలు చెప్తాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. 

అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్ ల ఐపీఎల్ అనుబంధం:
ఫస్ట్ కెప్టెన్: ఐపీఎల్ 2019 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ XI పంజాబ్) అర్ష్‌దీప్‌ను కొనుగోలు చేసింది. 2018, 2019 సీజన్లలో ఆ జట్టుకు అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అశ్విన్ సారథ్యంలో అర్ష్‌దీప్ 2019లో తొలిసారిగా 3 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత 2020లో అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారగా, అర్ష్‌దీప్ పంజాబ్‌లోనే కొనసాగాడు.

ALSO READ : శ్రీలంక సిరీస్‌కు బుమ్రా ఔట్.. 

ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ప్రయాణం: 
2020లో 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు, 2021లో 12 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్‌ను 2022 మెగా వేలానికి ముందు పంజాబ్ రిటైన్ చేసుకుంది. 2022 నుంచి పంజాబ్ తరఫున నిలకడగా ఆడుతూ తుది జట్టులో ప్రధాన పేసర్‌గా మారాడు. ఐపీఎల్ 2025 వేలానికి ముందు రిలీజ్ చేసినప్పటికీ, రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ ఉపయోగించి ఏకంగా రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతడ్ని తిరిగి దక్కించుకుంది. ఇప్పటి వరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీసిన అర్ష్‌దీప్, భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటూ రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు.

 

©️ VIL Media Pvt Ltd.