
- సోడియం నైట్రేట్ పొగ పీల్చడంతో ముగ్గురు మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో వినోద్ పిళ్లై(50), ఆయన భార్య సిర్జా పిళ్లై (45), కుమార్తె పూర్ణిమ పిళ్లై (19) మృతి చెందారు. సిర్జా పిళ్లై ఓ పాఠశాలలో కోఆర్డినేటర్‌గా పని చేస్తోంది. ఆమె పాఠశాలకు రాకపోవడంతో తోటి ఉద్యోగులకు అనుమానం వచ్చి ఆమె బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
వారు ఇంటికి వెళ్లి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వినోద్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. స్పాట్‌లో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ చావులకు ఎవరూ బాధ్యులు కాదని రాసి ఉంది.
మూడేళ్ల కింద నెహ్రూ నగర్‌లోని తమ ఇల్లు అమ్ముకుని అప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే సోడియం నైట్రేట్ అనే రసాయనాన్ని వినోద్ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు భావించారు. ఆ రసాయనాన్ని మండించడం వల్ల వెలువడిన పొగ గదిని నింపేసిందని, దానివల్లే మృతి చెందారని పోలీసులు తెలిపారు.