
ఫ్యామిలీ ఎమోషన్స్, హృద్యమైన ప్రేమకథ, అనుకోని పరిచయంతో సాగే ఫీల్‌గుడ్ డ్రామా కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు ‘చిన్న చిన్న ఆశై’ (Chinna Chinna Aasai) మంచి ఛాయిస్గా మారింది. ఇంద్రన్స్, సీనియర్ నటి మధుబాల, అపర్ణ బాలమురళి, విష్ణు అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. భావోద్వేగాలతో పాటు జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను అందంగా ఆవిష్కరించిన ఈ సినిమా కథేంటో ఇప్పుడు చూద్దాం.
Chinna Chinna Aasai is now streaming exclusively on JioHotstar in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi.@Aparnabala2#ChinnaChinnaAasaiMovie #JioHotstar #JioHotstarMalayalam #Romance #Drama #MalayalamMovie #NewMovie #Indrans #Madhubala pic.twitter.com/1z8zxvyGo9
— JioHotstar Malayalam (@JioHotstarMal) July 27, 2026
కథేంటంటే:
వారణాసిలో మాధవన్ మాస్టారు (ఇంద్రన్స్) కూతురు జానకి (అపర్ణ బాలమురళి) చదువుతోపాటు సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకుంటూ ఉంటుంది. ఆమెను చూడడానికి కేరళ నుంచి మాధవన్ అప్పుడప్పుడు వారణాసికి వచ్చి వెళ్తుంటాడు. అలా ఒకసారి వచ్చినప్పుడు, భయంతో ఒంటరిగా ఉన్న లీల (మధుబాల) అతనికి కనిపిస్తుంది. తంజావూరు నుంచి ఒక గ్రూప్‌గా వచ్చామని, తన సెల్‌ఫోన్, పర్స్ దొంగింలించారు.
ఆ దొంగను వెంబడించే క్రమంలో తాను బృందం నుంచి తప్పిపోయానని ఆమె చెప్తుంది. అది విన్న మాధవన్, తప్పిపోయిన వారి సమాచారం అందించే కేంద్రంలో లీల పేరు నమోదు చేసి, ఎవరో ఆమె కోసం వస్తే తనకు ఫోన్ చేయమని చెప్తే తన నెంబర్ ఇస్తాడు. భయపడాల్సిన పని లేదని, తంజావూరు గ్రూప్‌తో మళ్లీ కలిసేలా చూస్తానని ఆమెకు ధైర్యం చెప్తాడు.
మొదట కాస్త సంకోచించిన లీల తర్వాత తన జీవితం గురించి అతనితో మెల్లగా పంచుకుంటుంది. మాధవన్ కూడా తన భార్య శాశ్వతంగా దూరమైందని చెప్పి మనసు విప్పుతాడు. లీలకు వారణాసిని చూపించాలన్న ఉద్దేశంతో మాధవన్ ఆమెను వెంటబెట్టుకుని పరిసర ప్రాంతాలు చూపిస్తాడు. ఆ జర్నీలో వాళ్లకి ఎదురైన అనుభవాలు ఏంటి? వాళ్ల పరిచయం జీవితాలను ఎలా మార్చింది?త అనేదే మిగతా కథ.
🎬 Chinna Chinna Aasai
A heartwarming feel-good drama with an emotional climax that stays with you.
Best enjoyed with subtitles.
⭐ 3.5/5#ChinnaChinnaAasai #CineSuggest pic.twitter.com/WE05ufkJYF
— CINESUGGEST 🎬 (@TheCineSuggest) August 1, 2026
విశ్లేషణ:
‘చిన్న చిన్న ఆశై’..: కమర్షియల్ హంగులకు దూరంగా, జీవితంలోని చిన్న చిన్న ఎమోషన్స్ను హార్ట్ టచ్చింగ్గా ఆవిష్కరించిన ఫీల్‌గుడ్ డ్రామా. అనుకోకుండా కలిసిన ఇద్దరు అపరిచితుల మధ్య ఏర్పడే ఆత్మీయ అనుబంధాన్ని దర్శకురాలు వర్షా వాసుదేవ్ ఎంతో సహజంగా తెరపై చూపించారు. కథ నెమ్మదిగా సాగినా, పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నంలో దర్శకురాలు సక్సెస్ అయ్యారు.
►ALSO READ | Nani Nithiin Movie: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో.. నితిన్తో నాని మూవీ.. ఇంట్రెస్టింగ్గా టైటిల్ గ్లింప్స్
సినిమాకు ప్రధాన బలం ఇంద్రన్స్, మధుబాల నటన. మాధవన్ పాత్రలో ఇంద్రన్స్ తన సహజ నటనతో ఆకట్టుకోగా, లీల పాత్రలో మధుబాల హుందాతనం, ఎమోషన్స్‌తో మెప్పించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి. అపర్ణ బాలమురళి, విష్ణు అగస్త్య తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.
వారణాసి అందాలను సినిమాటోగ్రఫీ ఎంతో అందంగా చూపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని భావోద్వేగాలను మరింత బలపరుస్తుంది. సంభాషణలు కూడా హృదయాన్ని తాకేలా ఉండటం మరో ప్లస్ పాయింట్. అయితే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, కమర్షియల్ అంశాలు ఆశించే ప్రేక్షకులకు సినిమా కొంత స్లోగా అనిపించే అవకాశం ఉంది.
మొత్తంగా, ఎమోషనల్ డ్రామాలు, ఫీల్‌గుడ్ సినిమాలు ఇష్టపడే వారికి ‘చిన్న చిన్న ఆశై’ మంచి ఛాయిస్ గా నిలుస్తుంది. ప్రేమ, స్నేహం, ఒంటరితనం, మానవ సంబంధాల విలువను హార్ట్ టచ్చింగ్గా చెప్పిన ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.