
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా శక్తివంతమైన గ్రహం.. నవగ్రహాల్లో ధైర్యం.. సాహసం విషయంలో కీలక పాత్ర పోషించే కుజడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆగస్టు 3 వ తేదీ తెల్లవారుజామున 3.32 గంటలకు ప్రవేశించాడు. ఇదేరాశిలో సెప్టెంబర్ 18 వరకు సంచరిస్తాడు. ఈ ప్రభావం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుందని.. తిరుగులేని విజయాన్ని సాధిస్తాడని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
మేష రాశి : కుజుడు.. మిథునరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అత్యంత శుభప్రదం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. అదృష్టం మీ వెంటే ఉండటంతో ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పాత పెట్టుబడులకు లాభాలు వస్తాయి.ఉద్యోగస్తులు ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తారు. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.
సింహ రాశి: కుజుడు మీన రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అద్భుత ఫలితాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. గతంలో వివిధ కారణాల వలన ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి పనివారికి ఎంతో ఉపశమనం.. సంతోషం కలుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు అనుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఉద్యోగంలో పురోగతితో పాటు అధికారుల ప్రశంశలు అందుకుంటారు. కెరీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు.
కన్యా రాశి : మిధునరాశిలో కుజుని సంచారం ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది.
కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల సమాచారం లభిస్తుంది. అదృష్టం కలిసిరావడంతో క్లిష్టమైన పనులు కూడా సులువుగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొన్నిశుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి మెలిసి ఉంటారు. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కళలు, మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారికి భారీ డీల్స్ కుదురుతాయి. సంపదను కూడబెట్టడంలో మీరు విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి : కుజుడి రాశి మార్పు ఈ రాశి వారికి పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
పాత బాకీలు, ఇరుక్కుపోయిన సొమ్ము తిరిగి మీ చేతికి అందుతుంది. వ్యాపారవేత్తలు పెద్ద డీల్స్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. అందుకు అదృష్టం కూడా వీరికి తోడుంటుంది. అన్నిరంగాల్లోను తిరుగులేని విధంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతితోపాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
►ALSO READ | సిమెంటుతో శిల్ప కళా సౌందర్యం..తెలంగాణలో శిల్పకళకు ప్రాచీన చరిత్ర
మకర రాశి : ఈ రాశి వారికి మిథున రాశిలో కుజుని సంచారం వలన ధన ప్రవాహం పెరుగుతుంది. సుఖసంతోషాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది.ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు నూతనోత్సాహంతో పనిచేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు.. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
కుంభరాశి: కుజుడు.. మిథునరాశి పంచమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధించే అవకాశాలున్నాయి.ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది. వేతనం పెరగడం.. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ రావడం.. కావలసిన ప్రదేశానికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్ లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు వృద్ది చెందుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు.. బిజినెస్ ను విస్తరించే అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.