Reading Time: < 1 minute

బలమైన భవిష్యత్‌‌‌‌కు తల్లిపాలే పునాది : మంత్రి సీతక్క

Caption of Image.

ములుగు, వెలుగు: పిల్లల బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాదివంటిదని, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) పిలుపునిచ్చారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రతీ తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తల్లిపాలు అందించాలని తెలిపారు. 

తల్లిపాలు శిశువుకు సురక్షితమైన, స్వచ్ఛమైన, పోషక విలువలు కలిగినవని, శిశువు ఆరోగ్యవంతంగా ఎదగడానికి తల్లిపాలే బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. తల్లులు పోషకాహారం తీసుకోవడం ద్వారానే స్వచ్ఛమైన పాలు బిడ్డలకు అందుతాయని, దీంతో పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతారని తెలిపారు. టీచర్లు, ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బంది వారోత్సవాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

©️ VIL Media Pvt Ltd.