Reading Time: < 1 minute

పోలవరం: అంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు. జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి సుమార్ రూ.12 లక్షలు కాజేశారు. ఆర్టిఎ చలానా పేరుతో వచ్చిన లింక్‌ను ఎమ్మెల్యే క్లిక్ చేశారు. దీంతో ఆయన ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. మోసపోయినట్లు గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే జీలుగుమిల్లి పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.