
హైదరాబాద్, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్–15లో 24 ఫ్లాట్ల వేలానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 155 గజాల నుంచి 266 గజాల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు ఉన్నాయని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వీపీ గౌతమ్ ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
కొన్ని ఫ్లాట్లకు గజం రూ. 1.6 లక్షలు, మరి కొన్ని ఫ్లాట్లకు రూ. 1.40 లక్షలు అప్‌సెట్ ప్రైస్‌గా ఖరారు చేశామని ఆయన వెల్లడించారు. వేలంలో పాల్గొనాలనుకునే బిడ్డర్లు ఈఎండీ డిపాజిట్‌గా ఒక్క ఫ్లాట్‌కు రూ.2 లక్షలు ఈసేవలో చెల్లించాలన్నారు. ఈ నెల14న కేపీహెచ్‌బీ ఫేజ్1,2 లో హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్‌లో వేలం నిర్వహించనున్నట్టు వైస్ చైర్మన్ గౌతమ్ వెల్లడించారు.