
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆషాఢమాసం చివరిలో జరిగే ఊర పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొత్త దేవతామూర్తులను ఖిల్లాలోనే ప్రతిష్టించి సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలు మైసమ్మ గద్దె వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవతామూర్తులను నగరంలో ఊరేగింపు చేపట్టారు.
ఈ సందర్భంగా రోడ్లపై మేకలు, గొర్లను బలిచ్చారు. ఈ సారి వర్షాలు పుష్కలంగా పడాలని ఎలాంటి అరిష్టాలు అనారోగ్యాలు రాకుండా ఉండాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, తదితరులు దర్శించుకున్నారు. – వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్