Reading Time: < 1 minute

ఆర్‌‌‌‌బీఐ నిర్ణయంపై మార్కెట్ ఫోకస్‌‌.. ఆగస్టు 5న వెలువడనున్న వడ్డీ రేట్ల వివరాలు

Caption of Image.

న్యూఢిల్లీ: ఆర్‌‌‌‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం, అమెరికా–ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల కదలికలు ఈ వారం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌ను ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ నెల 3 నుంచి 5 వరకు జరగనున్న ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఈ వారానికి అత్యంత కీలకమైన డొమెస్టిక్ ట్రిగ్గర్. వడ్డీ రేట్లను హోల్డ్‌‌ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ, హాకిష్ సంకేతాలు ఇవ్వొచ్చని, ఫ్యూచరలో వడ్డీ రేట్లు పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.

 మరోవైపు  ఎస్‌‌బీఐ, భారతీ ఎయిర్‌‌టెల్, ఎల్‌‌ఐసీ, ఓఎన్‌‌జీసీ, హీరో మోటోకార్ప్, డీఎల్‌‌ఎఫ్ వంటి పెద్ద కంపెనీల జూన్ క్వార్టర్ ఫలితాలు ఈ వారం విడుదల కానున్నాయి. రిజల్ట్స్ బట్టి ఈ కంపెనీల షేర్ల కదలికలు ఉంటాయి. గత వారం సెన్సెక్స్ 2,034 పాయింట్లు, నిఫ్టీ 616 పాయింట్లు పుంజుకోగా, ఈ వారం కూడా సానుకూల ధోరణి కొనసాగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.