Reading Time: < 1 minute

తను 23 ఏళ్లుగా నిర్లక్ష్యాన్ని గురి అవుతున్నానని అందుకే బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని పక్కన పెట్టడం వెనుక బిసిసిఐ కార్యదర్శిగా పని చేసిన జై షా ఉన్నారని సోషల్‌మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తను రాజీనామా చేయడానికి బిసిసిఐలో ఓ ఉద్యోగి కారణమని జై షాకు, బిసిసిఐ అడ్మినిస్ట్రేషన్‌కు కానీ ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని శివరామకృష్ణన్ మరో పోస్ట్ పెట్టారు.

నా రాజీనామా చిత్రంలోకి బిసిసిఐ అడ్మినిస్ట్రేషన్‌ను తీసుకురావొద్దు. బిసిసిఐలో ఒకే ఒక్క ఉద్యోగి చేసిన నిర్వాకం ఇది. జై షాతో పాటు ఇతర పెద్దలకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’’ అని శివరామకృష్ణన్ వెల్లడించారు.