Reading Time: < 1 minute

బీసీ కులగణన కోసం మార్చి 23న చలో ఢిల్లీ

Caption of Image.

బషీర్​బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో బీసీల ప్రస్తావన లేకపోవడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు  అన్ని రాష్ట్రాల బీసీ నేతలు తరలిరావాలని పిలుపునిచ్చారు. 

శుక్రవారం కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విముఖత చూపుతోందని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. అనంతరం పలువురు బీసీ నేతలతో కలిసి ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, కుందారం గణేశ్​చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.