
కామారెడ్డి: ట్విన్స్ డే రోజున కవలలను కవలలు పెళ్లాడిన జంటల్లో నవవరుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే ఇద్దరూ కవలలను దేమికలాన్‌కు చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే మరో ఇద్దరు కవలలు ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకున్నారు. దుంపటి వినయ్ కుమార్ (31) అనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఉగాది పండుగ రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వినయ్ హైదరాబాద్ నగరంలోని ఒక కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి వినయ్ మృతికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు.