Reading Time: < 1 minute

హైదరాబాద్: లిటిల్ ఫ్యాన్ కుటుంబానికి నూతన దంపతులు విజయ్ దేవర కొండ, రష్మిక మందనా సర్ ప్రైజ్ ఇచ్చారు. రష్మిక- విజయ్ పెళ్లికి పిలవలేదని వీడియో చేసిన చిన్నారి కుటుంబాన్ని దేవరకొండ ఫ్యామిలీ ఇంటికి పిలిచింది.  ఆ చిన్నారి కుటుంబంతో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు, ఆనంద్ దేవరకొండ భోజనం చేశారు. విజయ్ ఇంట్లో చిన్నారి సందడి చేసింది. తనని భోజనానికి పిలిచి లడ్డూలు, అన్నదానం పెడుతున్నారని చిన్నారి చిట్టి పలుకులు పలికింది. ఇద్దరితో స్నేహంగా ఉంటానని చిన్నారి తెలిపింది.