
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం శివమొగ్గలో నీటి ఏనుగు దాడి చేయడంతో ఓ పశు వైద్యురాలు మృతి చెందింది. త్యావరకొప్ప టైగర్-లయన్ సఫారీలో సమీక్ష రెడ్డి అనే యువతి ఒప్పంద పద్దతిలో పశు వైద్యురాలుగా ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నీటి ఏనుగు నిండు గర్భంతో ఉంది. ఈ నీటి ఏనుగుకు (హిప్పపొటమస్) ఉష్ణోగ్రత ఎక్కువగా థర్మల్ కెమెరాతో సమీక్ష రెడ్డి పరీక్షిస్తుంది. నీటి ఏనుగు ఆమెపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే జూ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పశు వైద్యురాలు చనిపోయింది. ఈ ఘటనపై కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆమె కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.