
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ మూవీ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో సముద్రఖని మాట్లాడుతూ “ఈ సినిమా టైటిల్ కామాఖ్య అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అని చెప్పాను. ఇది అద్భుతమైన మూవీ”అని అన్నారు. డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ “నా మొదటి చిత్రం చిరంజీవా. ఆ చిత్రంలో యమధర్మరాజుకి ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పడం జరిగింది. కామాఖ్య అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సముద్రఖని, అభిరామి, సమైరా… ఇలా అద్భుతమైన నటీనటులందరూ కూడా వాళ్ల కోసమే ఈ పాత్రలు సృష్టించామా అన్నంత సహజంగా వారి పాత్రల్లో ఒదిగిపోయారు”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ వాణినాథ్ మాట్లాడుతూ “ఇది చాలా స్పెషల్ ప్రాజెక్టు. మా టీం ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిరామి, సమైరా పాల్గొన్నారు.