
స్టార్ కంపోజర్-, హీరో జివి ప్రకాష్ కుమార్ నటిస్తున్న మూవీ ’హ్యాపీ రాజ్’. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రా ల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సం దర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ ఈ వెంట్‌కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరో జీవి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ “మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ద్వారా ఈ సినిమా రిలీజ్ కావ డం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో ఫన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక అందమైన సందేశం ఉంది. సినిమా చూసిన తర్వాత ఆ ఈ కథ మీ మనసులను హత్తుకుంటుంది”అని అన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ “జీవి ప్రకాష్ కుమార్ సినిమాకి మ్యూజిక్ చేసిన, నటించినా ప్రాణం పెట్టి చేస్తారు. హీరోగా దాదాపు 20 సినిమాలు చేశారు. ఇప్పుడు హ్యాపీ రాజ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. మూవీ డైరెక్టర్ మరియా రాజా మాట్లాడుతూ “ఈ సినిమా కేవలం నవ్వించడమే కాదు చాలా భావోద్వేగాలతో అలరిస్తుంది. తప్పకుండా ఇది ప్రేక్షకులకి గుర్తుండిపోయే సినిమా”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, నిర్మాత జైవర్ద పాల్గొన్నారు.