
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ’దేత్తడి’. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని చూపిస్తున్నారు. ఆశిష్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా గ్లింప్స్‌ను మార్చి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్‌ను జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు క్రియేటివ్ హెడ్‌గా కూడా పని చేస్తున్నారు.