Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలంలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. తారాపురం గ్రామ శివారులో భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వెళ్తున్న బస్సు వెనుక టైర్ పేలింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకోవడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించాడు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రాణ నష్టం తప్పడంలో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 37 మంది ప్రయాణికులతో పాటు ఒడిశాకు చెందిన ఎంఎల్‌ఎ కూడా ఉన్నారు.