Reading Time: < 1 minute

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా మహిళా టీమ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ బేథ్ మూపీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 79 పరుగులు సాధించింది. ఇక ఎలిసె పేరి (36) పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ ఖియానా జోసెఫ్ (45), స్టెఫాని (28) రాణించినా ఫలితం లేకుండా పోయింది.