Reading Time: < 1 minute

ప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. రోజా నుంచి ఓకే బంగారం సినిమాల వరకు ఈ విషయాన్ని నిరూపించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మంగా తెరపైకి తీసుకురాబోతోంది. మద్రాస్ టాకీస్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి లాంటి సహజ నటితో తొలిసారి పని చేస్తున్న మణిరత్నం తనని ఎలా చూపిస్తాడు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.