
రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంత, సులభమైన సేవలను అందించేందుకు ‘వాహన్ పోర్టల్’ను ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు రవాణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.. ఈ పోర్టల్‌ను రవాణా, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ వాహన్ పోర్టల్ ద్వారా దేశ వ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమౌతుందని తెలిపారు. వాహన్‌తో అనుసంధానం వల్ల తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటా బేస్ లోకి వెళ్ళనున్నాయి. అంతే కాకుండా రెండవ వాహనాలకు వర్తించే అదనపు 2 శాతం జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రద్దు మార్చి 23 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు.