
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజ నకంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బహుశా పొరపా టున గత ఏడాది బడ్జెట్ నే చదివారేమో అన్న అనుమానం కలుగుతోందని, ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా, ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పుకోవడానికి ఒక్క రిజల్ట్ కూడా
లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో తీరని అన్యాయం జరి గిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి గత ఏడాది కంటే రూ. 1000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్నా, ఓవరాల్ బడ్జెట్‌లో దీని వాటా కేవలం 8 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (13 శాతం), బీహార్ (21శాతం) తమ బడ్జెట్‌లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ’ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు’ అని గొప్పలు చెప్పడం తప్ప, విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించడం లేదన్నారు.