Reading Time: < 1 minute

ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేలఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షలపన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా రవాణా శాఖ పనితీరు, కేటాయింపులపై మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనుకడుగు వేయడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1 కోటి 82 లక్షల నమోదిత వాహనాలు ఉండగా వ్యవసాయ, త్రిచక్ర వాహనాలకు చెందిన 11 లక్షల 75 వేల వాహనాలకు,

105 కోట్ల 16 లక్షలరూపాయల పన్ను మినహాయింపులు చేశామని తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు సారథి, వాహన్ లను తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహన్ సేవలను వచ్చే ఆరు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్‌బి రోడ్లను హామ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ అండ్ బి రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాల నినిర్ణయించామని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు.