Reading Time: < 1 minute

హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మికలు ఇటీవల వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి తనని ఆహ్వానించలేదు అంటూ.. ఓ చిన్నారి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘‘మనం కూడా ఫ్యాన్స్‌యే కాదా.. పిలిస్తే ఏమవుతుంది అంటా’’ అంటూ ఆ చిన్నారి వీడియోలో పలికిన మాటలు అందరినీ ముద్గుల్ని చేశాయి. ఈ వీడియో విజయ్ వరకూ చేరడంతో ‘‘నీకు ఏం ఇష్టమో చెప్పు. మనం కలిసి ఇంట్లోనే తిందాం’’ అంటూ అప్పుడే రిప్లే కూడా ఇచ్చాడు. తాజాగా ఆ చిన్నారిని ఇంటికి పిలిపించుకున్నారు ‘విరోష్’. ఆ చిన్నారిని ప్రత్యేక విందును ఇచ్చారు. విజయ్, రష్మికలు ప్రేమతో వడ్డించి.. ఆ బుజ్జి అభిమానిని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.