Reading Time: < 1 minute

హైదరాబాద్‌లో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం -1961 స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేసింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు కలిగించేందుకు.. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్‌లో హెచ్‌ఆర్‌ఏ 50 శాతం ఉంటుంది. తాజాగా ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది.

గతంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితిని 50 శాతంగా ఉంది. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ పేర్లను కూడా చేర్చారు. మొత్తం 8 నగరా ల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. మిగిలిన నగరాల్లోని వారికి 40 శాతం వరకు హెచ్‌ఆర్‌ఎ పన్ను కొనసాగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్ చేసే ఐటీ రిటర్స్‌కు ఇది వర్తించనుంది. ఏప్రి ల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానున్న సంగతి విదితమే. కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ చట్టంలో హెచ్‌ఆర్‌ఎ మినహాయింపుల కోస ం మరికొన్ని మెట్రో నగరాలను 50 శాతం కేటగిరీలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.