
న్యూఢిల్లీ: అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్, బెట్టింగ్ ఎక్స్ఛేంజీలు, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్, రియల్ మనీ కార్డ్-కెసినో గేమ్ యాప్స్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు ఇలాంటి 8,400 వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించింది. బెట్టింగ్, ఆన్‌లైన్ జూదం కారణంగా యువత పక్కదోవ పట్టడం, ఆర్థికంగా చికితిపోతున్నట్లు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. గతేడాది అక్టోబర్‌లో ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను తీసుకొచ్చింది. నగదుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక 4900 వెబ్‌సైట్లు/యాప్‌లపై చర్యలు చేపట్టింది.