Reading Time: < 1 minute

రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2026.27 వార్షిక బడ్జెట్‌లో డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ఆయన శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎంతో మేలు చేసే వడ్డీలేని రుణాలను ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కొత్తగా 18 ఏండ్లకు పైబడిన 61 ఏండ్లు దాటిన మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్పించుకోవాలని ప్రభుత్వం

ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రూ.5 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఆరోగ్య, విద్య అవసరాల కోసం స్త్రీ నిధి ద్వారా రుణాలు అందజేసుతన్నారు. వ్యవసాయ అనుబంధ, పరిశ్రమ అనుబంధ రంగాలతో జీవనోపాధి పొందేందుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. దీనికి అదనంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే వారికి రుణం వడ్డీ కోసం రూ.350 కోట్లు, పింఛన్లకు రూ.14,861 కోట్ల్లు మంజూరు చేశారు.