
హైదరాబాద్: బిసిల గురించి బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిజెపి, బిఆర్ఎస్ నేతలు ఒక్కటయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి నేతలు బిసిల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని, బిజెపి రాష్ట్రాధ్యక్ష పదవి, బిజెపి ఎల్పి పదవుల్లో అగ్రవర్ణ నేతలే ఉన్నారని మహేష్ గౌడ్ తెలియజేశారు. బిసిల రిజర్వేషన్ల కోసం తాము బిల్లు తీసుకొస్తే.. దానిని బిజెపి తొక్కిపెట్టిందని, రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడితే బిజెపి నేతలు మాట్లాడలేదని విమర్శించారు. బిజెపి, బిఆర్ఎస్ నేతలు మిలాఖత్ అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.