Reading Time: < 1 minute

అమరావతి: విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో రాళ్లవాక చెక్ పోస్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలవ్వడంతో క్షతగాత్రులను ఆస్సత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.