
పసికూన ఐర్లాండ్ టి-20 ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తన జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. దీంతో స్టిర్లంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి-20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టి-20 కెప్టెన్‌గా తప్పుకున్న వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
స్టిర్లింగ్ చివరగా టి-20 ప్రపంచకప్ 2026లో జట్టును నడిపించాడు. ఈ టోర్నమెంట్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడికి గాయం కావడంతో లోర్కాన్ టక్కర్‌కి కెప్టెన్సీ బాధ్యతలు తాత్కాలికంగా నియమించారు. ఇప్పుడు స్టిర్లింగ్ పూర్తిగా తప్పుకోవడంతో టక్కర్ లేదా హ్యారీ టెక్టర్‌కి ఐర్లాండ్ టి-20 జట్టు సారథ్య బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. స్టిర్లింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న.. జట్టులో సభ్యుడిగా మాత్రం కొనసాగుతాడు.