Reading Time: < 1 minute

టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వీడియోను విడుదల చేశారు. తాము బాంబు దాడులు చేయడంతో మొజ్తాబా తీవ్రంగా గాయపడి మృతి చెందాడని అమెరికా, ఇజ్రాయెల్ అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్‌ఐబిలో మొజ్తాబా వీడియోను ప్రసారం చేశారు. కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు అలీ ఖమేనీ మృతి చెందిన తరువాత తొలి వీడియోను విడుదల చేశారు. సుప్రీం నేతగా ఎన్నికైన తరువాత మోజ్తాబా కనిపించకపోవడంతో అందరూ చనిపోయి ఉంటారని భావించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మోజ్తాబా మృతి చెందాడని ఆరోపణలు చేయడంతో బలంచేకూరినట్లైంది. ఇరాన్ మీడియాలో ఈ వీడియోను విడుదల చేయడంతో ఆయన బతికే ఉన్నాడని తెలుస్తోంది. కానీ అది పాత వీడియో లేదా ప్రస్తుత పరిస్థితులపై ఎందుకు మాట్లాడలేదని నెటజన్లు అడుగుతున్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.