
చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో భూకంపం సంభవించింది. చేవేళ్ల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో కూడిన ప్రకంపనల రావడంతో ప్రజలు బయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీగా శబ్దం వినిపించింది. వెంటనే కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనల ధాటికి ఇంట్లో వస్తువులు కదిలాయని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది భూకంపమా లేక సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.