Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే హై దరాబాద్ సురక్షిత ప్రాంతమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సింగిల్ విండో విధానం అమలులోకి తెస్తున్నామని చె ప్పారు. ప్రపంచ సినీ పరిశ్రమను హైదరాబాద్‌ను హబ్‌గా మార్చడానికి కృషిచేస్తున్నట్లు వెల్లడించా రు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చార్మినార్‌కు నాలు గు మీనార్‌లు ఎలాగో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, రామానాయుడు అమితంగా కృషి చేశారని పేర్కొన్నారు. హై దరాబాద్ బిర్యానీకే కాదు దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియా తరహాలో మా ప్ర భుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.

ఇండియన్ సినిమా హైదరాబాద్ కేంద్రంగా పని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గద్దర్ ప్రజా యుద్ధ నౌక అని, ఆయన పిలుపుతో లక్షలాది మం ది కదిలేవారన్నారు. గద్దర్ తన గళంతో అనేక ఉ ద్యమాలకు ఊపిరిపోశారన్నారు. గద్దర్ పేరు మీ దుగా అవార్డులు ఇవ్వడం మా బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. సినీ పరిశ్రమకు గుర్తింపునివ్వాలని భావించామన్నారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్ తరలించేందుకు ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సినీ పరిశ్రమకు దాసరి నారాయణ రావు పెద్దగా వ్యవహరించారని పేర్కొన్నారు. సినీకార్మిక పక్షపాతిగా నటుడు ప్రభాకర్ రెడ్డి గొప్ప పనులు చేశారని కొనియాడారు.

సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే వేళ్లూనుకునేందుకు రామోజీరావు తీవ్రంగా కృషి చేశారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చి ఆదుకున్నారని, ఆనాడు సినీ రంగంలో ఏ సమస్య వచ్చినా ముందుండే దాసరి నారాయణ రావుని స్మరించుకోవాల్సినా అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇటీవల నెట్ ఫ్లిక్స్ తమ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని సిఎం తెలిపారు. నెట్ ఫ్లిక్స్ వచ్చిందంటే హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టేనని చెప్పారు. గద్దర్ ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి అని, తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. సినిమా అనేది మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ అని, సమాజాన్ని చైతన్యపరిచేందుకు సినిమాను సాధనంగా ఉపయోగించు కోవాలన్నారు. సామాజిక బాధ్యతను గుర్తెరిగి గద్దర్ స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరానికి సినిమా ద్వారా సందేశం అందించాలని సూచించారు.

తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగింది : భట్టి

తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహానీయుడు గద్దర్ అని. ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రపంచానికి చెప్పడమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని, అనేక సందేశాత్మక సినిమాలు ప్రజల్లో మార్పునకు నాంది పలికాయన్నారు. తెలుగు సినిమా తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచానికే తలమానికం కావాలని సిఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించారన్నారు. గత పాలకులు 10సంవత్సరాల పాటు సినిమా అవార్డులు ఇవ్వలేదని చెప్పారు. ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు, సినీ నటులు చిరంజీవి, కమల్‌హసన్, అక్కినేని నాగార్జున, అమల, జయసుధ, కుష్బు, అల్లు అర్వింద్, అశ్వినీదత్ తదితరులు పాల్గొన్నారు.