Reading Time: < 1 minute

ముంబయి: పూజల పేరుతో ఓ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అశోక్ ఖరాత్(67) అనే వ్యక్తి పూజలు చేయడంతో పాటు జ్యోతిష్యం చెప్పేవాడు. తన వద్దకు బాధలతో వచ్చిన  వారికి పూజాలతో సమస్యలను పరిష్కరించేవాడు. నాసిక్ లో ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అతడి నుంచి  రాజకీయాలు ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఓ మహిళకు ఇంట్లో సమస్యలు ఉండడంతో అతడిని కలిసి తన బాధాలను చెప్పుకుంది. పూజల పేరుతో మహిళకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అశోక్ ఇంట్లో ఉన్న పెన్ డ్రైవ్ తో పాటు లాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్ లో 58 అసభ్యకరమైన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అశోక్ కుమార్ బెడ్ రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్టు గుర్తించారు. గతంలో తాను నేవీ లో పని చేశానని అందరికి చెప్పుకునేవాడు.