
మన తెలంగాణ/హైదరాబాద్: నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం రూ.3.26 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపె ట్టే అవకాశం ఉందని తెలిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ప్రభుత్వం మూడు రంగాలు, ఆరు పథకాలపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. దీంతోపాటు తెలంగాణ విజన్- 2047 డాక్యుమెంట్‌లో ని పలు అంశాలకు సంబంధించి ప్రత్యేక నిధు లు కేటాయించనున్నట్టుగా తెలిసింది. నేడు ఉ.9:30 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అయి బ డ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే అధికారులతో సమావేశమై రం గాల వారీ కేటాయింపులు, కొత్త పథకాల ప్రకట న, అంచనాలను ఖరారు చేశారు. అయితే, కేటాయింపులు, పథకాలకు సంబంధించి సిఎం రేవంత్‌రెడ్డి కీలక మార్పులు సూచించడంతో ఈ ప్రతిపాదనలను డిప్యూటీ సిఎం భట్టి ఖరారు చేసినట్టుగా తెలిసింది. సంక్షేమం, అభివృద్ధి, దీర్ఘకాలిక వృద్ధి అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం రూపొందించినట్లుగా తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో బడ్జెట్
ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో బడ్జెట్. ఈ నేపథ్యంలోనే ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అ మల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త పథకాలను కూడా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. కొత్త పథకాల్లో భా గంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా కి ట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా ఆ రు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్టుగా సమాచారం. అయితే, రాష్టంలో కీలకమై న సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రం గాలకు సైతం బడ్జెట్‌లో ప్రభుత్వ పెద్దపీట వేయనున్నట్లుగా తెలిసింది. ఈ రంగాలకు భారీగా కేటాయింపులు చేయనున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
విద్యార్థినీలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లు
యంగ్ ఇండియా కిట్స్ కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో సంక్షేమ హాస్టళ్ల నుంచి సమీకృత గురుకుల సంస్థల వరకు ఉన్న విద్యార్థినీలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను అందించడమే ప్రభుత్వ ఉద్ధేశ్యంగా తెలుస్తోంది. ఎన్నికల హామీలకు అనుగుణంగా, ప్రభుత్వం బాలికా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను కూడా ఈ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించడంతో పాటు, మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా సమాచారం.
కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను..
గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త అధికంగానే సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ బడ్జెట్‌లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం. ఇక, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం ఈ బడ్జెట్‌లో నిధులను కేటాయించనున్నట్టు తెలిసింది. వీటితో పాటు తుమ్మిడిహెట్టి, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, కొడంగల్ నారాయణ్‌పేట్ ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బిసిలకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో దీనికోసం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.