
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి గురువారం తమపార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 111 మంది అభ్యర్థుల పేర్లు , పోటీ చేసే స్థానాలు ఉన్నాయి. సీనియర్ నేతలు రేఖా పాత్ర హింగల్‌గంజ్ నుంచి, సోరార్పూర్ దక్షిణ్ నుంచి రూపా గంగూలీ పోటి చేస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు రెండు విడతలుగా ఏప్రిల్ 23, ఏప్రిల్ 29వ తేదీలలో జరుగుతాయి. సబిత బర్మన్ ఇటాహార్ నుంచి బరిలోకి దిగుతారు. స్వపన్ మజుందార్ బాంగాన్ దక్షిణ్ నుంచి నిలబడుతారు. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పాలనను దెబ్బతీసేందుకు చాలా కాలంగా బిజెపి పావులు కదుపుతోంది.