Reading Time: < 1 minute

కేరళ ముఖ్యమంత్రి 80 ఏళ్ల వయోవృద్ధుడు, పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు గురువారం ఉదయం 11గంటల సమయంలో తలస్సెరి సబ్ రిజిస్ట్రాల్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కన్నూర్ రిజిస్ట్రార్ ఈ నామినేషన్ పత్రాలను స్వీకరించారు. పినరయి విజయన్ వెంట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కెకె రాజేష్,సీనియర్ నేత ఇపి జయరాజన్, స్పీకర్ ఎఎన్ షమ్‌సీర్, ఆయన రాజకీయ కార్యదర్శి పి శశి నామినేషన్ దాఖలు సందర్భంగా అనుసరించారు..

విజయన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది ఏడోసారి. అలాగే ధర్మదం నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీకి దిగారు. గతంలో ఆయన కుతుపరంబ నియోజకవర్గం నుంచి మూడుసార్లు, పయ్యనూర్ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. బుధవారం నాడు నియోజకవర్గంలో విజయన్ తన ప్రచారాన్ని రోడ్‌షోతో ప్రారంభించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్ తరఫున విపి అబ్దుల్ రషీద్, బీజేపీ తరుఫున కె రంజిత్ పోటీకి దిగారు.