
ప్రజలు సంతోషంగా జీవించే దేశాలలో భారత్.. పాకిస్థాన్, నేపాల్ కంటే వెనుకబడిపోయింది. మార్చి 19, గురువారం ప్రపంచ సంతోష నివేదిక 2026లో మొత్తం 140కి దేశాల జాబితాలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. గతేడాది 118వ స్థానంలో ఉన్న ఇండియా..ఈసారి నుంచి రెండు స్థానాలు మెరుగుపడినప్పటికీ..నేపాల్, పాకిస్తాన్‌ల కంటే వెనుకబడింది.
ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. విశ్వాసం, సామాజిక మద్దతు, జీవన నాణ్యత స్థాయిల ఆధారంగా ఫిన్లాండ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగిస్తోంది. ఈ జాబితాలో ఐస్‌లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వంటి దేశాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాలు బలమైన ప్రభుత్వ సంస్థలు, తక్కువ అవినీతి, ఉన్నత జీవన ప్రమాణాలతో ఉంటాయి. ఇరాన్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్.. ఈ జాబితాలో 8వ స్థానంలో నిలవడం విశేషం.
కాగా, ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీ అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ప్రపంచ సంతోష నివేదికను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేస్తుంది. ప్రజలు తమ జీవితాలను ఎలా అంచనా వేసుకుంటారు, ఎలా చూస్తారు అనే దాని ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇచ్చే ఈ నివేదికలో దేశాల శ్రేయస్సు సమాచారాన్ని… వివిధ రంగాలకు చెందిన ప్రపంచ స్థాయి పరిశోధకుల విశ్లేషణతో కలిపి పొందుపరుస్తారు.