
సూర్య తన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ’కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించిన ’కరుప్పు’ ఫస్ట్ లుక్ టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సూర్య ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.