
బ్యాటింగ్‌లో ఎంతో బలంగా ఉన్న టీమిండియాకు బౌలింగ్ సమస్య వెంటాడుతోందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టు బౌలింగ్ భారాన్ని జస్‌ప్రిత్ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లో బుమ్రా తప్ప మిగతా బౌలర్ ఎవరూ కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదన్నాడు. వరుణ్ చక్రవర్తి వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడన్నాడు. ప్రస్తుతం బుమ్రా తర్వాత ఒక్క సిరాజ్ మాత్రమే మెరుగైన బౌలర్‌గా కనిపిస్తున్నాడన్నాడు. వీరిద్దరు తప్పిస్తే భారత్‌లో మరో మ్యాచ్ విన్నర్ బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదన్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బౌలింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఇప్పటి నుంచే ఈ విషయంపై జట్టు యాజమాన్యం దృష్టి సారించాలని అశ్విన్ సూచించాడు. లేకుంటే రానున్న రోజుల్లో జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఖాయమని హెచ్చరించాడు.