Reading Time: < 1 minute

మహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ మరో షాక్ తగిలింది. గడ్చిరోలిలో జిల్లాలో గురువారం ఐదుగురు కీలక సభ్యులతో సహా మొత్తం 11 మంది నక్సలైట్లు పోలీసులు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.68 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారుస లొంగిపోయిన వారిలో డివిసిఎం, ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్‌ స్థాయి మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. 2025 నుంచి ఇప్పటివరకు గడ్చిరోలి జిల్లాలో మొత్తం 123 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం దాదాపుగా అంతమైపోయిందని చెప్పారు.