Reading Time: < 1 minute

ఖతార్‌పై ఇరాన్ మరోసారి దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌కు చెందిన ప్రధాన చమురు క్షేత్రం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇకపై ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగదు. అయితే ఈ దాడుల సాకుతో ఇరాన్ చర్యకు దిగితే అమెరికా ఇక ఏకంగా ఈ చమురు క్షేత్రాన్ని నేలమట్టం చేస్తుందని సామాజిక మాధ్యమంలో తెలిపారు. తాము చేపట్టే చర్యలతో ఎంత నష్టం ఇరాన్‌కు వాటిల్లుతుందనేది చెప్పలేం, తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయి.

అంతేకాకుండా ఇరాన్‌పై భవిష్యత్తులో పెను ప్రభావం పడుతుందని, అక్కడి చమురు నిల్వల వనరులకు జరిగే నష్టాన్ని సూచనప్రాయంగా తెలిపారు. ఇరాన్ తమ దేశ ఇంటలిజెన్స్ మంత్రి అమెరికా , ఇజ్రాయెల్ సేనల దాడులలో హతులు అయ్యారు. దీనితో ఇరాన్ మరింత ప్రతీకార దాడులకు దిగింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని పలు చమురు క్షేత్రాలను ఎంచుకుని దాడులకు దిగింది. ఈ క్రమంలోనే ఖతార్‌పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా పరిగణించింది.