
న్యూమెక్సికో: మైనర్లుగా పరిచయం చేసుకొంటూ చిన్నారులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు అమెరికాలోని న్యూ మెక్సికో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ తెలుగు యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని బల్కం నాగరాజుగా పోలీసులు గుర్తించారు.
అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా న్యూ మెక్సికోలోని శాంటఫే నగర పోలీసులు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఖాతాలు తెరిచారు. పోలీసులు సైతం చిన్నారులుగా పలువురు అనుమానితులతో చాటింగ్ చేశారు. చిన్నారులను లైంగికంగా ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.