Reading Time: < 1 minute

గౌహతి: అస్సాంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 126 అసెంబ్లీ స్థానాలకు 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 87 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కోక్రాఝర్ స్థానం నుండి మానిక్ బ్రహ్మ, బావ్‌ఖుంగ్రి నుండి సపాలి మాలిక్, పర్బత్‌ఝోరా నుండి అష్రాఫుల్ ఇస్లాం షేక్, ధుబ్రి నుండి బేబీ బేగం, జలేశ్వర్ నుండి అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా, అభయపురి నుండి ప్రదీప్ సర్కార్, సిడ్లి చిరాగ్ నుండి మతిలాల్ నార్జరీ, చెంగా నుండి అబ్దుర్ రహీం అహ్మద్, పాకబెత్‌బారి నుండి జాకిర్ హుస్సేన్ సిక్దార్ మరియు బక్సా నుండి జగదీష్ మదాహి బరిలోకి దిగనున్నారు.

ఇక, తమూల్‌పూర్ నుండి రఫీ డైమరీ, ఉదల్‌గురి నుండి సోరెన్ డైమరీ, లహరిఘాట్ నుండి ఆసిఫ్ మహమ్మద్ నజర్, నాగావ్-బటాద్రబా నుండి దుర్లభ్ చమువా, నదువార్ నుండి సునీల్ ఛెత్రి, రంగోనది నుండి జయంత్ ఖౌండ్, లఖింపూర్ నుండి ఘనా బురాగోహైన్, ధకువాఖానా నుండి ఆనంద నారా, మకుల్ నుండి శిబనాథ్ చేతియా మరియు ఖుమ్‌తాయ్ నుండి రోసెలీనా టిర్కీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.