
ఒకప్పుడు విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆ తర్వాత హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు అభిమాన నటుడిగా మారిపోయారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. గతేడాది ఆయన కుమారుడు విష్ణు నటించి ‘కన్నప్ప’ సినిమాలో మోహన్‌బాబు ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ ఏడాది మరో విభిన్నమైన పాత్రలో మోహన్ బాబు కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో మోహన్ బాబు షిఖంజ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్యారడైజ్ టీం ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో షిఖంజ మాలిక్ పాత్ర కోసం మోహన్ బాబు ఎలా రెడీ అయ్యారో చూపించారు. ఈ జనరేషన్‌కి మోహన్ బాబు అంటే ఏంటో.. ఆయన నటన సామర్థ్యం ఏంటో తెలియదని.. కానీ ప్యారడైజ్‌తో అది తెలిసేలా చేస్తామని శ్రీకాంత్ ఓదెల వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.